Saturday, April 4, 2009

తను ధన మాన ప్రాణాలను గడ్డిపోచలలాగ తోసిపుచ్చి  
స్వేచ్చ స్వాతంత్ర్యాలతో కూడిన స్వరాజ్యాన్ని 
మనకోసం సాధించి పెట్టిన 
ఆ అమౄత మూర్తులకు, అపార త్యాగ ధనులకు 
శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ 

కనీసం మనము ఇప్పుడు ఊహించుకోవటానికి కూడా భయపడే 
ఎన్నెన్నో త్యాగాలకు ఫలితంగా వారసులమైన మనకు 
చెరగని ఆస్థిగా స్వేచ్చను ఇచ్చి 

కొన్ని కోట్లమంది దుర్భర దారిద్ర్యముతో, యుద్ధ భయంతో
మరుక్షణం ఉంటామో లెదో తెలియని పరిస్థితులలో ఉన్న  
నేటి రోజులలో కూడా
ఇలాంటీ చక్కని జీవితాలను ప్రసాదించి పెడితే.......


మనము మన చేతులారా, 
నిర్లక్ష్యము, భయము, బద్ధకములతో 
సోమరితనము, దురాశ వంటి దుర్లక్షణాలతో
ఈనాడు
మన భారతావనిని
మన కళ్ళముందే......

అయ్యో!

మనలో ఎవ్వరమూ ఏమీ చెయ్యలేమా?
పోరాటమూ, త్యాగమూ అక్కరలేదు
కనీసపు ఆలోచన, సరియైన నిర్ణయం 
తీసుకోలేమా?

నా మరియు నాలాంటి ఎంతోమంది ఆక్రోశం 
బూడిదలో పోసినట్టేనా?

ఎవరైనా చేయికలుపుతారా?
మనమొక బ్రహ్మాండమైన రక్షణ వలయాన్ని నిర్మిద్దామా?